భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీజేపీ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ నెల్లికుదురు మండల అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా ముందస్తు అరెస్టులు చేయించడం దుర్మార్గమని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని చందు రాజ్‌కుమార్ యాదవ్ అన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో సంబంధిత కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగా ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ముందస్తు అరెస్టులతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరని చందు రాజ్‌కుమార్ యాదవ్ అన్నారు. విద్యార్థుల తరఫున ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల జనరల్ సెక్రెటరీ రాస యాకిరెడ్డి, ఉపాధ్యక్షులు కుక్కల ఐలయ్య, సీనియర్ నాయకులు చట్ల సంతోష్, జల్ల రమేష్, సలుగు ప్రవీణ్, మోడం నరసయ్య, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ కనుకుంట్ల శ్రీకాంత్, భూక్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.