భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీజేపీ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ నెల్లికుదురు మండల అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా ముందస్తు అరెస్టులు చేయించడం దుర్మార్గమని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం విడుదల…