భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

సీపీఎం సీనియర్ నాయకుడు నెలకుర్తి సీతారాంరెడ్డి బాటలో నడుద్దాం

సీపీఎం సీనియర్ నాయకుడు నెలకుర్తి సీతారాంరెడ్డి బాటలో నడుద్దాం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అమరజీవి సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ నెలకుర్తి సీతారాం రెడ్డి ఆశయాలు, పోరాట మార్గం అందరికీ దిక్సూచిలాంటివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య అన్నారు. మంగళవారం నెలకుర్తి వెంకటరెడ్డి నివాసంలో సీతారాం రెడ్డి మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి నాగయ్య మాట్లాడుతూ చిన్నతనం నుంచే సీపీఎం పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితుడైన నెలకుర్తి సీతారాం రెడ్డి పార్టీకి, మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ నియమ నిబంధనలను పాటిస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నాన్న ఆశయాలను నెరవేరుస్తా: వెంకట్ రెడ్డి

నెలకుర్తి సీతారాం రెడ్డి కుమారుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. వర్ధంతి సభకు హాజరై తన తండ్రికి నివాళులర్పించిన ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు, కార్యకర్తలు “సీతారాం రెడ్డి అమర్ రహే” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు.

కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సమ్మెట రాజమౌళి అధ్యక్షత వహించారు. సీపీఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రాజు, దుడ్డెల రామ్మూర్తి, విస్సంపల్లి సైదులు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు బండపల్లి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ టౌన్ సెక్రటరీ బానోత్ సీతారాం, భానోత్ వెంకన్నతో పాటు సీపీఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.