భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అమరజీవి సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ నెలకుర్తి సీతారాం రెడ్డి ఆశయాలు, పోరాట మార్గం అందరికీ దిక్సూచిలాంటివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య అన్నారు. మంగళవారం నెలకుర్తి వెంకటరెడ్డి నివాసంలో సీతారాం రెడ్డి మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి నాగయ్య మాట్లాడుతూ చిన్నతనం నుంచే సీపీఎం పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితుడైన నెలకుర్తి సీతారాం రెడ్డి…