భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బంతి కోసం పోరు.. పాయింట్ కోసం పట్టుదల.. విజయం కోసం చివరి వరకు ఉత్కంఠ.. నర్సాపూర్ బి.వి.ఆర్.ఐ.టి కళాశాల వేదికగా నిర్వహించిన రాక్‌బాల్ జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అజయ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్‌డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, చివరకు హర్యానా జట్టు పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో టైటిళ్లను కైవసం చేసుకుంది.
సీనియర్ బాయ్స్‌లో హర్యానా ఛాంపియన్.. యూపీ రన్నరప్
సీనియర్ బాయ్స్ విభాగంలో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ప్రత్యర్థి జట్టును సమర్థంగా ఎదుర్కొంటూ వేగం, బంతిపై నియంత్రణ, టీమ్‌వర్క్, వ్యూహాత్మక ఆటతీరుతో ఆకట్టుకుని ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ప్రతి పాయింట్ కోసం క్రీడాకారులు చివరి వరకు పోరాడటంతో ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులను ఉత్కంఠకు గురిచేసింది.
మిక్స్‌డ్ విభాగంలోనూ హర్యానా జోరు
సీనియర్ మిక్స్‌డ్ విభాగంలోనూ హర్యానా జట్టు మరోసారి సత్తా చాటి ఛాంపియన్‌గా నిలిచింది. అద్భుతమైన సమన్వయంతో ఆటను కొనసాగిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. తెలంగాణ జట్టు రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. సొంత రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు ఫైనల్ వరకు దూసుకెళ్లి రన్నరప్‌గా నిలవడం క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఉమెన్స్ విభాగంలోనూ హర్యానా జట్టే టైటిల్‌ను కైవసం చేసుకోగా, ఛత్తీస్‌గఢ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దీంతో మూడు ప్రధాన విభాగాల్లోనూ హర్యానా ఆధిపత్యం కొనసాగింది.
దేశం నలుమూలల నుంచి.. నర్సాపూర్‌కు క్రీడా సందడి
బి.వి.ఆర్.ఐ.టి కళాశాల జాతీయ స్థాయి రాక్‌బాల్ పోటీలకు వేదిక కావడంతో నర్సాపూర్‌లో క్రీడా సందడి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించగా, స్థానిక క్రీడాభిమానులకు జాతీయ స్థాయి క్రీడాకారుల ఆటతీరును ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ఫైనల్ ఛాంపియన్‌షిప్ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి యాదవ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చెష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ రంగాకృష్ణ, ఎస్సై రంజిత్ రెడ్డి, బి.వి.ఆర్.ఐ.టి ప్రిన్సిపల్ బాపిరాజు తదితరులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. నర్సాపూర్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సహకారంతో పోటీలు విజయవంతంగా ముగిశాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలు నర్సాపూర్‌లో రాక్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలిచే అవకాశాలను పెంచాయి.