భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నెల్లికుదురుకు నూతన అంబులెన్స్ ప్రారంభం

నెల్లికుదురుకు నూతన అంబులెన్స్.. ప్రారంభించి నజాతీయ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ చొరవ, కృషితో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి ఆధునిక వసతులతో కూడిన నూతన అంబులెన్స్ మంజూరైంది. ఈ అంబులెన్స్‌ను హుస్సేన్ నాయక్ బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ మాట్లాడుతూ.. తమతో పాటు పార్టీ మండల శాఖ చేసిన విజ్ఞప్తికి స్పందించిన హుస్సేన్ నాయక్, ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ నిధుల సహకారంతో నెల్లికుదురు మండలానికి అంబులెన్స్ మంజూరు చేయించారని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగంగా వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

నెల్లికుదురు మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని మదన్ లాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలు కీలకంగా మారనున్నాయని అన్నారు. మండల ప్రజల తరఫున హుస్సేన్ నాయక్‌కు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట రమేష్, సాయి గౌడ్, రొయ్యల చంటి, గుగులోతు బావిసింగ్‌తో పాటు వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.