భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

కరాటేలో నిత్యశ్రీ ప్రతిభ.. కలెక్టర్ అభినందనలు

నిత్యశ్రీ నీ అభినందించిన మెదక్ జిల్లా కలెక్టర్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరాటేలో ప్రతిభ కనబరిచి పలు పతకాలు, ఛాంపియన్‌షిప్‌లు సాధించిన మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నిత్యశ్రీని మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. కరాటేలో 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌తో పాటు 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన నిత్యశ్రీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

నిత్యశ్రీ నీ అభినందించిన మెదక్ జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ నిత్యశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రీడల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచడం అభినందనీయమని, పట్టుదలతో సాధన చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

నిత్యశ్రీ మాట్లాడుతూ.. నగేష్ మల్లూరి సారథ్యంలో కరాటేలో శిక్షణ తీసుకుంటూ ఇప్పటివరకు పలు పతకాలు సాధించినట్లు తెలిపారు. తనకు లభించిన శిక్షణ, నిరంతర సాధన వల్ల కరాటేలో 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించానని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రూస్లీ ఐకాన్ అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.