భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరాటేలో ప్రతిభ కనబరిచి పలు పతకాలు, ఛాంపియన్‌షిప్‌లు సాధించిన మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నిత్యశ్రీని మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. కరాటేలో 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌తో పాటు 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన నిత్యశ్రీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నిత్యశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రీడల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచడం అభినందనీయమని, పట్టుదలతో సాధన చేస్తే మరిన్ని…