భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి ఎంపీడీవో కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

ఇనుగుర్తి ఎంపీడీవో ఆఫీసులో కాళోజీ జయంతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బండారి పార్థసారథి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ సాహిత్య సేవలను, ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అనంతరం ఎంపీడీవో బండారి పార్థసారథి మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన మాటలు, కవితల ద్వారా కాళోజీ ధిక్కార స్వరాన్ని వినిపించేవారని అన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కాళోజీ నారాయణరావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు.

తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భాషలోని సహజత్వం, సామాజిక సమస్యలను తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని పార్థసారథి కొనియాడారు. ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తాయని అన్నారు. కాళోజీ ఆశయాలను, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో దీప్లా నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ రంజిత్, కార్యాలయ ఉద్యోగులు ప్రణీత్, వివేక్‌తో పాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించి, ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు.