భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బండారి పార్థసారథి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ సాహిత్య సేవలను, ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం ఎంపీడీవో బండారి పార్థసారథి మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన మాటలు, కవితల ద్వారా కాళోజీ ధిక్కార స్వరాన్ని వినిపించేవారని అన్నారు. తెలంగాణ…





