భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వినాయక చవితి ఉత్సవాలపై పోలీసుల సూచనలు

నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తూప్రాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వినాయక మండపాల నిర్వాహకులు, ఆర్గనైజర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్పీ తూప్రాన్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం

నిమజ్జన ప్రదేశం పరిశీలన.. అనంతరం డీఎస్పీ తూప్రాన్ నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువును సందర్శించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.

వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.