భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తూప్రాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వినాయక మండపాల నిర్వాహకులు, ఆర్గనైజర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ తూప్రాన్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు,…





