భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, మాజీ మార్కెట్ చైర్మన్ పరకాల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎమ్మెల్సీ తనయుడు డాక్టర్ దుష్వంత్ రావు, ఎమ్మెల్సీ సతీమణి సంధ్యారాణి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఉద్యమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అద్వితీయమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా సాధికారత, అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిట్యాల జనార్ధన్, ముత్యం వెంకన్న, ఎస్.కె. మహబూబ్ పాషా, జర్రిపోతుల వెంకన్న, మారినేని రఘు, ఎడ్ల వేణుమాధవ్, నాగేశ్వరరావు, మారినేని కిరణ్, సుధా మోహన్, గుగులోతు రాజు, రాము, వెంకటాద్రి, నిలుకుర్తి వెంకట రెడ్డి, జగన్, నరేష్, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.