భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు చాకలి సాయిలు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను, ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ.. సమాజం కోసం చాకలి ఐలమ్మ చేసిన సేవలు, ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అన్యాయాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి సాయిలు, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ సర్పంచ్ ప్రకాశ్, కుమ్మరి సతీష్, వార్డు సభ్యులు ఛత్రూ నాయక్, గ్రామ పెద్దలు వనమాల రాములు, ముత్తు, కారోబార్ నాగభూషణం, రజక సంఘం సభ్యులు చాకలి పెద్ద బిక్షపతి, నర్సింలు, చాకలి చిన్న బిక్షపతి, భరత్, చాకలి వెంకటేశ్వర్లు, లైన్మెన్ సురేష్, వడ్ల మల్లేశం, ప్రవీణ్, డప్పు నర్సింలు, కొన్యాల సామేల్ తదితరులు పాల్గొన్నారు.