భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు చాకలి సాయిలు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను, ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ రాజేందర్…





