భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

బ్యాంకులు రుణ లక్ష్యాలను సాధించాలి: ప్రతిమాసింగ్

బ్యాంకులు రుణ లక్ష్యాలను సాధించాలి   మొదటి త్రైమాసికం లో  1713.32  కోట్ల రుణాల పంపిణి.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా ఆర్థిక వృద్ధి రేటులో మెదక్ జిల్లా దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేశారని తెలిపారు. ఏప్రిల్ 2026 నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కాలంలోనే జిల్లాలోని వివిధ రంగాలకు రూ.1,713.32 కోట్ల రుణాలను మంజూరు చేయడం గమనార్హమన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మొదటి త్రైమాసికంలో నిర్దేశించిన రుణ లక్ష్యంలో 24.33 శాతం పూర్తి చేయడం బ్యాంకర్ల పనితీరును అర్థం చేసుకునేలా ఉందన్నారు. వ్యవసాయం, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పంపిణీ చేసిన రుణాలు జిల్లాలో ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి 100 శాతం రుణ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

బ్యాంకులు రుణ లక్ష్యాలను సాధించాలి   మొదటి త్రైమాసికం లో  1713.32  కోట్ల రుణాల పంపిణి.

రంగాల వారీగా రుణాల పంపిణీ తీరు (రూ. కోట్లలో): వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.936.80 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి రూ.316.31 కోట్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.144.28 కోట్లు, గృహ రుణాలకు రూ.4.46 కోట్లు, విద్యా రుణాలకు రూ.0.93 కోట్లు, ఇతర రంగాలకు రూ.441.10 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అందించే రుణాల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. యువతకు ఉపాధి కల్పించే పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి పథకాలపై బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు భద్రత కల్పించేందుకు ‘కేవైసీ.. సురక్షిత బ్యాంకింగ్‌కు మీ తొలి అడుగు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.