భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో ముగిసిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు

ఇనుగుర్తి లో ముగిసిన ఎస్జిఎఫ్ క్రీడా పోటీలు..  జోన్ స్థాయికి 74 మంది బాల బాలికలు ఎంపిక..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ ఎస్జీఎఫ్ మండల స్థాయి ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీల ఎంపికలు గురువారం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 74 మంది బాలబాలికలు జోన్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అంతకుముందు క్రీడా పోటీలను స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి, ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, హెచ్‌ఎం అమ్మ యాకయ్య తదితరులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే క్రీడలపై ఆసక్తి పెంచుకొని ప్రతిభను చాటుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, జాతీయ సమైక్యత పెంపొందుతాయని పేర్కొన్నారు.

జోన్ స్థాయికి 74 మంది ఎంపిక: పీడీ ప్రణయ్

ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 280 మంది బాలబాలికలు పాల్గొన్నారని స్థానిక ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ తెలిపారు. వీరిలో వివిధ క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 74 మంది క్రీడాకారులను జోన్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో కేసముద్రం మండలం పెనుగొండ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న జోన్ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ ఆశ, వీరన్న, ఎండీ రహీంబి, రజినీకాంత్, భాస్కర్ రెడ్డి, ఉప్పలయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్లు మధుకర్, కవిత, మహేశ్వరి, కూటికంటి ప్రణయ్, సీనియర్ క్రీడాకారులు ఎండీ పాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.