భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ ఎస్జీఎఫ్ మండల స్థాయి ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీల ఎంపికలు గురువారం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 74 మంది బాలబాలికలు జోన్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అంతకుముందు క్రీడా పోటీలను స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి, ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, హెచ్‌ఎం అమ్మ యాకయ్య తదితరులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు…