భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ

ఇనుగుర్తి లో ఘనంగా అయిలమ్మ వర్ధంతి..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్, రజక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆహూతులైన వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం తొలి భూపోరాటానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

సామాజిక ఆధునిక పరిణామానికి ఆద్యురాలైన వీరమాత ఐలమ్మ అని పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని, తెగువను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గోపందాస్ కృష్ణ, రజక సంఘం అధ్యక్షులు కొలిపాక నారాయణ, ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, సట్ల మల్లయ్య, దార్ల రామ్మూర్తి, దీకొండ వెంకన్న, పప్పుల వెంకన్న (టీచర్), చిన్నాల కట్టయ్య, దుంపల సందీప్, పప్పుల వెంకన్న (108), బేతమళ్ల మనోజ్, మహేందర్ రెడ్డి, పింగిళి శ్రీనివాస్, బూర రజినీకాంత్, మంకాళి రామ్ సలీమ్, మల్లెపాక రమేష్, బూర విస్తారి పాల్గొన్నారు.

అలాగే వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.