భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్, రజక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆహూతులైన వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం తొలి భూపోరాటానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

సామాజిక ఆధునిక పరిణామానికి ఆద్యురాలైన వీరమాత ఐలమ్మ అని…