భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి 8 వైల్డ్ కార్డులు.. రేసులో ఎవరెవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి 8 వైల్డ్ కార్డులు.. రేసులో ఎవరెవరంటే?

భారత్ సమాచార్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. సెలబ్రిటీలు, కామనర్స్‌గా రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు తమదైన శైలిలో గేమ్ ఆడుతున్నారు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ ప్రారంభమై నాలుగు రోజులే కావడంతో కంటెస్టెంట్ల బలాలు, బలహీనతలపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం కష్టమే.

అయితే హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ మాత్రం తన ప్రవర్తనతో హౌస్‌లో హైలైట్ అవుతున్నాడు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్న అతడి తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రోహిత్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నప్పటికీ, త్రిగుణ్ మంచి ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఏకంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘బిగ్ అగ్ని పరీక్ష 2’లో సత్తా చాటిన దీపక్, మితిలేష్, రామకృష్ణ, అపూర్వలలో ఇద్దరికి ప్రధాన కంటెస్టెంట్లుగా అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమని తెలుస్తుండగా, మితిలేష్ కూడా రేసులో ఉన్నాడని సమాచారం. అపూర్వకు అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ సీరత్ కపూర్, ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ఫేమ్ సోనియా, ఆషిక, సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్‌లను కూడా బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్లు సమాచారం. అయితే వీరి ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.