భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

మృతురాలి కుటుంబానికి వాకిటి అనంతరెడ్డి ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబానికి వాకిటి అనంతరెడ్డి ఆర్థిక సాయం

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఆలకుంట్ల కృష్ణ మాతృమూర్తి ఆలకుంట్ల మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి శుక్రవారం మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా వాకిటి అనంతరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తనవంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయం చేయాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెముడాల అనిత నర్సింగ్ యాదవ్, బొడ్డు వెంకటరమణ రెడ్డి, వలిగొండ పీఏసీఎస్ డైరెక్టర్ కల్కూరి చంద్రయ్య, ఉపసర్పంచ్ బూడిద నాగరాజు, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గంజి అశోక్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చెవ్వ మధు ముదిరాజ్, వార్డు సభ్యులు ఉక్కుర్తి పద్మ నరసింహ, నిమ్మల వెంకటయ్య, పోలేపల్లి ప్రభాకర్, మారబోయిన మత్స్యగిరి తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో గంగదారి అశోక్, ఉకుర్తి శీను, బోదాసు దుర్గయ్య, పిట్టల వెంకన్న, ఆలకుంట్ల రాములు, బూడిద రమేష్ తదితరులతో పాటు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్లమ్మ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు.