భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఆలకుంట్ల కృష్ణ మాతృమూర్తి ఆలకుంట్ల మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి శుక్రవారం మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా వాకిటి అనంతరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తనవంతు సహాయంగా రూ.5 వేల…





