భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బుల్లెట్ ట్రైన్ కోసం 29వ రోజు రిలే నిరాహార దీక్ష

బుల్లెట్ ట్రైన్ సాధించుకునే వరకు ఉద్యమం ఆగదు

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణానికి బుల్లెట్ ట్రైన్ సాధించాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం 29వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి దీక్షను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా మొత్తం బుల్లెట్ ట్రైన్ సాధన కోసం ఉద్యమబాట పట్టిందని వారు తెలిపారు.

ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ప్రజానాట్యమండలి కళాకారులు ఈసారి బుల్లెట్ ట్రైన్ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కాలికి గజ్జెలు కట్టి, చేతిలో డప్పులు పట్టుకుని దీక్షలో పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలతో దీక్షా శిబిరం ఉత్సాహభరితంగా కొనసాగింది. బుల్లెట్ ట్రైన్ కోసం సాగుతున్న ఉద్యమానికి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సందేశాన్ని వినిపించారు.

దీక్షలో ప్రజానాట్యమండలి కళాకారులు వేల్పుల వెంకన్న, బచ్చలకూరి రాంబాబు, యాతకుల ప్రవీణ్, చిత్రం శ్రీను, పల్లెల రాము, నందిపాటి సతీష్, కంపాటి చంద్రశేఖర్, ఉప్పల వెంకట్ గోపి, కందుకూరి శ్రీకాంత్, నిమ్మాది మనోజ్, పిడమర్తి అశోక్, ప్రభాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఈ దీక్షకు సంఘీభావంగా రమణచారి, జర్నలిస్టు లువజ్జే వీరయ్య, కందుకూరి యాదగిరి, నెమ్మది వెంకటేశ్వర్లు, చలమల్ల నరసింహ, బూర్గుల ప్రభాకర్ దంపతులు, బొల్లెద్దు వినయ్, పేర్ల నాగయ్య, సకినాల కృష్ణ, నేరెళ్ల మధు, డేవిడ్ కుమార్, శంకర్ రెడ్డి, జహంగీర్, బయ్య మల్లికార్జున్, వెలుగు వనిత, ఎలకచర్ల శోభారాణి, కునుకుంట్ల సైదులు, దరావత్ రవి, సల్వది మల్లయ్య, సట్టు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు ఢిల్లీ వరకు వినిపించేలా ఉద్యమాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.