భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణానికి బుల్లెట్ ట్రైన్ సాధించాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం 29వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి దీక్షను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా మొత్తం బుల్లెట్ ట్రైన్ సాధన కోసం ఉద్యమబాట పట్టిందని వారు తెలిపారు.
ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేపట్టిన…





