భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోషల్ స్టడీస్ టీజీటీగా, తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఎం.ఏ. అంజుమ్ సుల్తానా ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపికయ్యారు. విద్యా రంగంలో వినూత్న బోధనా విధానాలను తెలుసుకునే అవకాశం లభించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంజుమ్ సుల్తానా మాట్లాడుతూ ఫిన్లాండ్‌లో అమలవుతున్న వినూత్న, అనుభవాత్మక, కార్యకలాప ఆధారిత బోధనా పద్ధతులను అధ్యయనం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే బోధనలో సాంకేతికత వినియోగం, సమ్మిళిత విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యసనను అంచనా వేసే మూల్యాంకన పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్ ద్వారా పొందే జ్ఞానం, అనుభవాలను తిరిగి తన విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తానని అంజుమ్ సుల్తానా తెలిపారు. తరగతి గది కార్యకలాపాలు, ప్రాజెక్టులు, డిజిటల్ వనరుల ద్వారా విద్యార్థులకు కొత్త తరహా అభ్యసన అనుభవాలను అందించి, చదువును మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ పర్యటనలో నేర్చుకున్న అంశాలను ఉపయోగించుకుంటానని చెప్పారు.
అదేవిధంగా జిల్లా అధికారుల అనుమతితో ఎక్స్‌పోజర్ విజిట్‌లో పొందిన జ్ఞానం, అనుభవాలను జిల్లాలోని సహ ఉపాధ్యాయులతో పంచుకుంటానని తెలిపారు. తద్వారా ఫిన్లాండ్‌లోని ఉత్తమ విద్యా విధానాల్లో ఉపయోగకరమైన అంశాలను స్థానిక విద్యా విధానాలతో అనుసంధానం చేసి విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అంజుమ్ సుల్తానా పేర్కొన్నారు.