భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

రాజీతోనే సమస్యలకు పరిష్కారం.. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు

నర్సాపూర్‌ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం సెప్టెంబర్ 12న నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఎం. హేమలత మాట్లాడుతూ రాజీనే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా వెలువడే తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందని తెలిపారు. రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని, స్నేహపూర్వక భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా కొనసాగే వివాదాలకు రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించేలా లోక్ అదాలత్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కోర్టు ఏజీపీ డి. శ్రీధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ గౌడ్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ శాస్త్రుల మధుశ్రీశర్మ, లీగల్ సర్వీసెస్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్, కౌడిపల్లి ఎస్‌ఐ అమరేందర్ రెడ్డి, చిలప్‌చెడ్ ఎస్‌ఐ నర్సింలు, ఎక్సైజ్ ఎస్‌ఐ, సీనియర్ న్యాయవాదులు ఆర్. శ్రీనివాస్ రెడ్డి, ఈ. సత్యనారాయణ, సి.హెచ్. స్వరూపరాణి, పి. సుధాకర్, న్యాయవాదులు నాగరాజు, జాట్రోత్ రవినాయక్, ఏ. సాయిరాం, బి. మానయ్య, నీలవేణి పాల్గొన్నారు.

కోర్టు సూపరింటెండెంట్ ఎం.ఎల్. సూర్య ప్రకాష్, లీగల్ సర్వీస్ టైపిస్ట్ కం అసిస్టెంట్ కే. సుభాష్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీస్ కోర్టు సిబ్బంది, కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లు హరిబాబు గౌడ్, దిలీప్ గౌడ్, శ్రీనివాస్, ఆనంద్‌తో పాటు కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో పలు కేసులను పరిష్కరించారు.