భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కోమటిపల్లిలో కిశోర బాలికలకు అవగాహన

కోమటిపల్లిలో కిశోర బాలికలకు అవగాహన.. బాలికలు సమతుల్యాహారం తీసుకోవాలి..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎదిగే వయసులో కిశోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలని సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ సూచించారు. మండలంలోని కోమటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శనివారం కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచి భిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడారు.

కిశోర బాలికలు ఎక్కువగా రక్తహీనతకు గురై బరువు కోల్పోయి నీరసంగా ఉంటున్నారని సర్పంచి తెలిపారు. దీనిని అధిగమించేందుకు ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎదిగే వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.

అనంతరం అంగన్వాడీ టీచర్లు చిర్రగోని రాజకుమారి, చిర్రగోని కవిత, ఆడెపు జ్యోతి కిశోర బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆరోగ్య స్థితి, ఋతు పరిశుభ్రత వంటి విషయాలను బాలికలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ మూర్తి, మాజీ సర్పంచి నీలం యాకయ్య, మాజీ ఉపసర్పంచ్ యాకయ్య, సీఏ శిరీష, ఆశా వర్కర్లు మల్లిక, విజయతో పాటు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.