భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎదిగే వయసులో కిశోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలని సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ సూచించారు. మండలంలోని కోమటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శనివారం కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచి భిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడారు.
కిశోర బాలికలు ఎక్కువగా రక్తహీనతకు గురై బరువు కోల్పోయి నీరసంగా ఉంటున్నారని సర్పంచి తెలిపారు. దీనిని అధిగమించేందుకు ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉండే పోషకాహారాన్ని…





