భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి  డీజేలకు అనుమతులు లేవు.. నిబంధనలు పాటించాలి: పోలీసులు

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట సీఐ మొలుగూరి రవి ఆధ్వర్యంలో వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రామన్నపేట సీఐ మొలుగూరి రవి, వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. మండల ప్రజలందరూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి  డీజేలకు అనుమతులు లేవు.. నిబంధనలు పాటించాలి: పోలీసులు

అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని పోలీసులు తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గణేష్ ఉత్సవాలను విజయవంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖకు ఉత్సవ కమిటీలు సహకరించాలని అధికారులు కోరారు.