భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట సీఐ మొలుగూరి రవి ఆధ్వర్యంలో వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రామన్నపేట సీఐ మొలుగూరి రవి, వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. మండల ప్రజలందరూ…





