భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం.. ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం.. ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, బళ్లారి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి తదితర అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రముఖ రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం సంస్థాపక కార్యదర్శి, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ విశేషంగా హల్‌చల్ చేస్తోంది.

వినాయక చతుర్థికి ముందుగానే అందుబాటులోకి వచ్చిన ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంథం ఎంతో బాగుందని, కంటెంట్‌తో పాటు కటౌట్ కూడా ఆకట్టుకునేలా ఉందని తెలంగాణ సచివాలయంలోని పలువురు అధికారులు, అనధికారులు పురాణపండ శ్రీనివాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళప్రదమైన, పరమాద్భుతమైన, అరుదైన గణపతి వర్ణచిత్రాలు గ్రంథానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం.. ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు ఆదిశంకరాచార్యులు, ప్రాచీన ఋషులు రచించిన కొన్ని ముఖ్య స్తోత్రాలకు పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యానం భక్త పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సౌందర్యవంతమైన భాషలో ఆయన అందించిన వ్యాఖ్యానం భక్తి భావాన్ని మరింత పెంచేలా ఉందనే అభిప్రాయాలు అన్ని ప్రాంతాల నుంచి వినిపిస్తున్నాయి.

ఏ4 సైజులో జపాన్ ఆర్ట్ పేపర్‌పై ప్రత్యేక ఆకర్షణతో డిజిటల్ ప్రింటింగ్ ద్వారా రూపొందించిన ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంథం హైదరాబాద్‌లోని వందలాది కాలనీలకు చేరుకుంది. దీంతో ఈ వినాయక చవితి సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ పతాకం ప్రత్యేకంగా రెపరెపలాడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం కార్యాలయం, రవీంద్రభారతి, రాజపుష్ప, మైహోం, మైహోం అవతార్, అపర్ణ, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ బడా గణేష్, కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వేలాది మంది భక్తుల చేతుల్లో ఈ పుస్తకం కనిపిస్తుండటం మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం.. ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

ఎన్ని కష్టాలు ఎదురైనా దైవబలంతో వాటిని ఎదుర్కొంటూ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న పురాణపండ శ్రీనివాస్.. ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంథం ఈ గణేశ నవరాత్రుల్లో జంట నగరాల్లో సంచలనం సృష్టిస్తోందని ముందుగానే చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య, మరోవైపు వారాహి చలనచిత్రం అధినేత, శ్రీ అమృతేశ్వర ఆలయం ఫౌండర్ చైర్మన్ సాయి కొర్రపాటి తదితర ప్రముఖుల సమరంతో అందిన ఈ మంగళ మంత్ర పేటిక సుమారు వంద పేజీలతో రూపొందింది. అనేక మంత్ర, తంత్ర, యంత్రాత్మక విశేషాలను ఇందులో పొందుపరుస్తూ వైదిక బద్ధతతో, శ్రుతి గౌరవంతో భక్త పాఠకులకు రచనా సంకలనంగా అందించడం ద్వారా పురాణపండ శ్రీనివాస్ కొత్త పుంతలు తొక్కించారనే చెప్పాలి.

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే.. శ్రీనివాస్ బుక్స్‌కు, ఆయన రచనా శైలికి లక్షల్లో అభిమానులు, అనుచరులు ఉన్నారనేది స్పష్టమవుతోంది. వారందరి పాలిట ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ మహా గణపతి అనుగ్రహంగా అందిన అక్షర కల్పవృక్షమేనని చెప్పాల్సిందేనని విజ్ఞుల అభిప్రాయం.