భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ ఆసోద భీమయ్య (58) మృతి బాధాకరమని స్థానిక సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి భాస్కర్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన భీమయ్య పార్థివ దేహాన్ని వారు ఆదివారం సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భీమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ భీమయ్య మృతితో ఆయన కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాల మహానాడు జాతీయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ భీమయ్య కన్నుమూత ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జెల్ల సోమయ్య, మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్, గ్రామస్తులు తాళ్ల రామిరెడ్డి, చిర్ర వెంకట్, పిడుగు మురళి, ఎస్‌కే అజీమ్, నాగ మురళితో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.