భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

గ్రామ గ్రామాన కొలువుదీరిన గణనాథులు

గ్రామ గ్రామాన కొలువుదీరిన గణనాథులు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, తండాల్లో సోమవారం గణనాథులు భక్తిశ్రద్ధలతో కొలువుదీరారు. లంబోదరుని కోసం తాత్కాలిక ఆలయాలను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. గణపతి బప్పా మోరియా అంటూ గణనాథులను మండపాలకు తీసుకువచ్చి వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని ప్రతిష్ఠించారు. 21 పత్రాలతో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిన్ననాగారం హనుమాన్ టెంపుల్ వద్ద..

గ్రామ గ్రామాన కొలువుదీరిన గణనాథులు

మండలంలోని చిన్ననాగారంలో శ్రీ హనుమాన్ టెంపుల్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వినాయకుని ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు, అర్చక సమాఖ్య రాష్ట్ర నేత తిరున హరికృష్ణమాచార్యులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ప్రతిష్ఠాపన క్రతువులు, పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహదాత, ఆర్యవైశ్య సంఘం నేత మాలె రమేష్ ఉమ దంపతులతో పాటు ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు మిత్తింటి బాలకృష్ణ రమ దంపతులు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ జొన్నలగడ్డ అశోక్ రెడ్డి, జర్నలిస్టు పంజాల వాసుదేవ గౌడ్, ఉత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఉడుత సంతోష్ మంజుల, బైరు హరిప్రసాద్ రమ, కొయ్యడి మల్లయ్య విజయ, చిర్రబోయిన కుమార్ శిరీష, పోలోజు సుధాకరాచారి జ్యోతి దంపతులు, బైరు శ్రీరాములు గౌడ్, సుధాకర్ గౌడ్, పంజాల నాగరాజుగౌడ్, బింగి శరత్ గౌడ్, మహిళా భక్తులు పోలోజు వజ్రమ్మ, కలమ్మ, బింగి నిర్మల, సోమేశ్వరి, పోలోజు శ్రీమణి, సరస్వతి, బొలగాని సుమలత తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ముత్యాలమ్మ టెంపుల్ వద్ద గణపతి..

శ్రీ ముత్యాలమ్మ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్ఠించారు. విగ్రహదాత ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన మాదాటి రామమూర్తి సుజాత దంపతులు, వారి కుమారుడు మాదాటి సందీప్ నంద శ్రీ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.

గ్రామ గ్రామాన కొలువుదీరిన గణనాథులు

వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, గుండాల మంగమ్మ ధర్మయ్య, కాంగ్రెస్ మండల నాయకులు బైరు శ్రీనివాస్ గౌడ్ రజిత దంపతులు, జర్నలిస్టు పంజాల వాసుదేవగౌడ్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు బొలగాని బ్రదర్స్ శివ సాయి గౌడ్, సూర్య ప్రతాప్ గౌడ్, బండారి బ్రదర్స్ మనోజ్ కుమార్ గౌడ్, ఈశ్వర్ ప్రసాద్ గౌడ్, బైరు హృషికేష్, మద్దెబోయిన రాకేష్ గౌడ్ బ్రదర్స్‌తో పాటు భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.

దేదీప్యమానంగా హనుమాన్ గణపతి ఆలయం..

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చిన్ననాగారంలోని భక్త ఆంజనేయ స్వామి గణపతి ఆలయాన్ని నిర్వాహకులు మునుపెన్నడూ లేని విధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. విద్యుత్ వెలుగుల్లో శోభాయమానంగా లంబోదరుడు సుందరవదనుడై భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతూ పులకించిపోతున్నారు.