భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, తండాల్లో సోమవారం గణనాథులు భక్తిశ్రద్ధలతో కొలువుదీరారు. లంబోదరుని కోసం తాత్కాలిక ఆలయాలను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. గణపతి బప్పా మోరియా అంటూ గణనాథులను మండపాలకు తీసుకువచ్చి వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని ప్రతిష్ఠించారు. 21 పత్రాలతో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిన్ననాగారం హనుమాన్ టెంపుల్ వద్ద..

మండలంలోని చిన్ననాగారంలో శ్రీ హనుమాన్ టెంపుల్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో…