భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాగోల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

టిప్పర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.