భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాగోల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
…





