భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి

మద్దిరాల: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించాలని ఎమ్మార్వో వినతిపత్రం

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల తహసీల్దార్‌కు భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు వడ్డానం యతి రాజారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వంగూరి రమేష్, మండల అధ్యక్షుడు వల్లపు అశోక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948న తెలంగాణకు పూర్తి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు.

ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విమోచన దినంగా ప్రకటించారని వారు పేర్కొన్నారు. గోల్కొండ నవాబు పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే క్రమంలో నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయారని, అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని వివరించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన సమయంలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం లేదని వారు విమర్శించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మద్దిరాల మండల తహసీల్దార్‌కు మెమోరాండం అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మద్దిరాల మండల అధ్యక్షుడు వల్లపు అశోక్, జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు వడ్డానం యతి రాజారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వంగూరి రమేష్, మండల సభ్యులు తాడోజు విక్రమ్, సతీష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.