భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

గిరిజనులకు కేసీఆర్ చేసిన మేలు మరువలేం.. నేతలు

17న గిరిజన గ్రామాల్లో kcr చిత్ర పటానికి పాలాభిషేకం..  తాటికొండ సీతయ్య exmpp

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఈ నెల 17న గిరిజన గ్రామాల్లో పాలాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు. తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గిరిజనులకు న్యాయం జరిగేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు.

గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. అదేవిధంగా చిన్నచిన్న తండాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి, ఆయా తండాలకు చెందిన వారే సర్పంచులుగా ఎన్నికై తమ గ్రామాలను తామే పాలించుకునే గొప్ప అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు.

గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా గత కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని, అయితే మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన గిరిజనులను ప్రస్తుతం అష్టకష్టాల పాలుచేస్తూ మూడేళ్లుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న గిరిజన గ్రామాల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, గుగులోతు కాలరామ్ నాయక్, మాజీ సర్పంచులు వీరోజీ నాయక్, యాకు నాయక్, పూన్య నాయక్, మండల నాయకులు దశరథ్ నాయక్, శ్రీను నాయక్, పూర్ణ నాయక్, పులాని నాయక్, రవి నాయక్, రమేష్, మల్యాల రాములు, నాగమల్లు, దుర్గయ్య, హరిబాబు, గోపగాని వెంకన్న, తడకమళ్ల రవికుమార్, మధు, మల్లి, కహార్జున్ తదితరులు పాల్గొన్నారు.