భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న అన్ని తండాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న మండలంలోని అన్ని గిరిజన తండాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.