భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: నల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన విబీజీ రాంజీ పథకంపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన రైతులు, ఉపాధి కూలీలు గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచి అశోక్ కుమార్ మాట్లాడుతూ విబీజీ రాంజీ పథకంలో 318 పనులు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత పనులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తుందని వివరించారు. రైతులు, తండావాసులు వ్యవసాయ బావులు, ఫారం పాండ్‌లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, కొత్త చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పాత చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు తదితర పనుల కోసం విబీజీ రాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామసభను ఎంపీడీవో సింగారపు కుమార్ సందర్శించి పరిశీలించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తహసీల్దార్ ఆరా
హనుమాన్ నగర్ తండాలో గ్రామసభ జరుగుతున్న సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తహసీల్దార్ చంద నరేష్ గ్రామసభలో పాల్గొన్నారు. సంబంధిత సిబ్బందిని ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. నోటీసులు అందజేసిన వారి వివరాలన్నీ అందాయా అని ఆరా తీశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచి గుగులోతు శ్రీలత యాకు, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, జీపీఓ అనిరెడ్డి మురళి, సీనియర్ అసిస్టెంట్ రవళి, ఫీల్డ్ అసిస్టెంట్ భూక్య రవి, వార్డు సభ్యులు ప్రభాకర్, లక్పతి, సోమల రవి, రమ్య, సక్కు, రజిత, తండావాసులు, రైతులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.