భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం

హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంబేద్కర్ సంఘం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కల్పిత నాయకుడు అంబేద్కర్ అంటూ విద్రోహపూరిత పుస్తక రచనకు పాల్పడి, ఈ నెల 18న పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన రచయిత హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను మంగళవారం మండల కేంద్రం ఇనుగుర్తిలో దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో హమారా ప్రసాద్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంబేద్కర్ సంఘం..

ఈ సందర్భంగా గోపందాస్ కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై విషం చిమ్ముతూ కల్పిత పుస్తక రచనకు పూనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.