భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కల్పిత నాయకుడు అంబేద్కర్ అంటూ విద్రోహపూరిత పుస్తక రచనకు పాల్పడి, ఈ నెల 18న పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన రచయిత హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను మంగళవారం మండల కేంద్రం ఇనుగుర్తిలో దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో హమారా ప్రసాద్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

ఈ…