భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కుంభం మహేందర్ రెడ్డి

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కుంభం మహేందర్ రెడ్డి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల జర్నలిస్టులు సమావేశమై మండల నూతన ప్రెస్ క్లబ్‌కు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నమస్తే తెలంగాణ రిపోర్టర్ కుంభం మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కుంభం మహేందర్ రెడ్డి

మండల కేంద్రం ఇనుగుర్తిలోని వద్దిరాజు నారాయణ మెమోరియల్ పార్కులో సోమవారం వినాయక చవితి పురస్కరించుకుని మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ ఉపాధ్యక్షుడిగా సూర్య దినపత్రిక రిపోర్టర్ షేక్ యాకూబ్ పాష, ప్రధాన కార్యదర్శిగా వార్త దినపత్రిక రిపోర్టర్ దార్ల భాస్కర్, కోశాధికారిగా దిశ రిపోర్టర్ జాటోత్ సంతోష్, సంయుక్త కార్యదర్శిగా మన తెలంగాణ విలేకరి కూటికంటి మధు ఎంపికయ్యారు.

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కుంభం మహేందర్ రెడ్డి

ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి మండల జర్నలిస్టుల సమాలోచనలు, సహకారంతో కృషి చేస్తానన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో వివిధ పత్రికలకు చెందిన మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.