భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల జర్నలిస్టులు సమావేశమై మండల నూతన ప్రెస్ క్లబ్‌కు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నమస్తే తెలంగాణ రిపోర్టర్ కుంభం మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

మండల కేంద్రం ఇనుగుర్తిలోని వద్దిరాజు నారాయణ మెమోరియల్ పార్కులో సోమవారం వినాయక చవితి పురస్కరించుకుని మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ ఉపాధ్యక్షుడిగా సూర్య దినపత్రిక రిపోర్టర్ షేక్ యాకూబ్ పాష, ప్రధాన కార్యదర్శిగా…