భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సాఫీగా, శాంతియుతంగా, భద్రతాపూర్వకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, పార్కింగ్, ప్రజల రాకపోకలు తదితర అంశాల్లో సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా బిబీనగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. ప్రభాకర్ రెడ్డి, బిబీనగర్ తహసీల్దార్ పి. శ్యామ్ సుందర్ రెడ్డి, బిబీనగర్ ఎంపీడీఓ వై. శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పి. శ్యామ్ గౌడ్ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.