భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సాఫీగా, శాంతియుతంగా, భద్రతాపూర్వకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, పార్కింగ్, ప్రజల రాకపోకలు…