భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా ఇంజనీర్స్ డే..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతరత్న, ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో మంగళవారం ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాలకట్టయ్య యాదవ్ విద్యార్థులకు ఉద్బోధిస్తూ.. విశ్వేశ్వరయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన గొప్ప ఇంజనీర్ అని తెలిపారు. 1908 సంవత్సరంలో మూసీ నది వరద పోటెత్తిన సమయంలో తన సృజనాత్మకతతో హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి కాపాడారని వివరించారు. విశాఖపట్నం పోర్టు సముద్రపు నీటి కోతకు గురికాకుండా సమర్థవంతమైన, అద్భుతమైన ఇంజనీరింగ్ పద్ధతులను అమలు చేసి కాపాడారని తెలిపారు.

విశ్వేశ్వరయ్యను నాటి బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించగా, భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో గౌరవించిందని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం ఆయన సేవలను కీర్తించాయని వివరించారు. విద్యార్థులు విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీష, అప్సర, నవ్య, షాహిన్, శ్రీలత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.