భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌కు ప్రాధాన్యత

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గంలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే సూచించారు. పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌కు ప్రాధాన్యత

క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పాఠశాలల్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చేలా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

పోచారం, లకడారం సబ్‌స్టేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్ల ప్రారంభం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు.