భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో బుధవారం ఇనుగుర్తి మండల తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దుంపల సందీప్ మాట్లాడుతూ తెలంగాణ విమోచనకు కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛా ప్రతిమను ఏర్పాటు చేయడంతో పాటు సప్త సంకల్పాలను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లాలో విమోచన స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, అమరవీరుల అధికారిక జాబితాను రూపొందించాలని కోరారు. చారిత్రక గ్రామాల్లో విమోచన స్మారక స్తూపాలు ఏర్పాటు చేయడంతో పాటు విమోచన పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోలపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా సీనియర్ నాయకులు కాలసాని ప్రభాకర్ రెడ్డి, అనుమాండ్ల యాకూబ్ రెడ్డి, వల్లం రాజేందర్, వెంపటి సందీప్, మందుల బాబు, కుల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.